వివాహ బంధంతో ఒక్కటైన నటుడు సిద్దార్థ్ , నటి అదితిరావు హైదరీ
3 months ago | 33 Views
నటుడు సిద్దార్థ్ , నటి అదితిరావు హైదరీ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌విూడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు‘ అని అదితి క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సిద్దార్థ్‌తో రిలేషన్ గురించి అదితి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'మహా సముద్రం’ షూట్‌లో తమ మధ్య పరిచయం ఏర్పడిరదన్నారు. కొంతకాలానికి అది స్నేహంగా మారిందన్నారు. తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్దార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పారు. మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపా. కొన్నేళ్లక్రితం ఆమె కన్నుమూశారు. ఈ విషయం సిద్దార్థ్‌కు తెలుసు. ఓ రోజు నా వద్దకువచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చొని.. అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడని అదితి చెప్పారు. అయితే సిద్దార్థ్ గతంలోనే పెళ్లి చేసుకోగా..అతనికిది రెండో వివాహం.
ఇంకా చదవండి: తెలుగు మూవీతో కరీనా ఎంట్రీ ?
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Siddharth # AditiRaoHydari # MahaSamudram