రజనీకాంత్‌తో నటించడం అంటే..జ్వరం వచ్చేసింది: 'వేట్టయ్యన్' హీరోయిన్ దుషార విజయన్
4 months ago | 48 Views
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు టీజే ఙ్ఞానవేల్ రూపొందిస్తున్న 'వేట్టయ్యన్’లో యువ నటి దుషార విజయన్ ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవలే సినిమాలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. ఈ అవకాశంపై ఆమె స్పందించింది. తాజాగా ఓ విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అ షూటింగ్ సమయంలో జరిగిన తన అనుభవాలను పంచుకుంది. 'వేట్టయ్యన్’ చిత్రంలో తలైవర్‌తో కలిసి నటించాననే గర్వంతో పాటు భయం ఏర్పడింది. . షూటింగ్‌కు ముందు రోజు ఏకంగా జ్వరమే వచ్చింది. ఆయనతో కలిసి నటించే సమయంలో ఒక వైపు జ్వరం, మరోవైపు ముచ్చెమటలు పట్టాయని తెలిపింది. పట్టరాని సంతోషం.. మరోవైపు భయం, ఆందోళన.
ఈ రెండిరటిని ఏక కాలంలో అనుభవించాను. అలాంటి మానసికస్థితిలో రజనీతో కలిసి నటించాను. ఇది ఒక కలగానే ఉంది. అలాగే, ఫహద్ ఫాజిల్‌తో కలిసి 'వేట్టయ్యన్’ కోసం కలిసి చేయడం కూడా గొప్ప అనుభూతిగా ఫీలవుతున్నాను. అందుకే 'రాయన్’ తరహాలోనే'వేట్టయ్యన్’ మూవీ కూడా నా కెరీర్‌లో నిలిచిపోతుంది’ అని పేర్కొన్నారు. 'బోదై ఏరి బుద్థి మారి’ చిత్రం ద్వారా 2019లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది నటి దుషారా విజయన్. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వం వహించిన 'సార్పట్టా పరంబరై’ చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో అవకాశాలు వరుస కట్టాయి. అలాగే 'నక్షత్రం నగర్గిరదు’, 'కళువేత్తి మూర్కన్’, 'అనీతి’ వంటి చిత్రాల్లో నటించింది ఇటీవలే ధనుష్ హీరోగా వచ్చిన 'రాయన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'వేట్టైయాన్’ లో, విక్రమ్'వీర ధీర శూరన్’ చిత్రంలోనూ నటిస్తోంది.
ఇంకా చదవండి: అతిలోకసుందరి శ్రీదేవి 61వ పుట్టినరోజు సందర్భంగా ఖుషీ కపూర్ మరియు బోనీ కపూర్ తన ఫోటోలతో ప్రత్యేక నివాళులర్పించారు
# Vettaiyan # Rajinikanth # Dusharavijayan