మళయాళ బ్యూటీల నటపథం.. పాత్ర చిన్నదైనా నటనకు సై
2 months ago | 25 Views
మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు యువ హీరోయిన్లు తమిళ చిత్రాల్లో నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. హీరో, దర్శకుడు, నిర్మాత, నిర్మాణ సంస్థ, ఆ సినిమాలో నటించే సహ నటీనటులు ఎవరు? ఇలా ఏ ఒక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, స్టోరీకి అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. ఆ పాత్ర చిన్నదా? పెద్దదా? అనే విషయాన్ని కూడా వారు పట్టించుకోవడం లేదు.
ఈ విషయంలో నిఖిలా విమల్ , అన్నా బెన్, రజీషా విజయన్, పార్వతి తిరువోతులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ’వాళై’ చిత్రంలో నటించిన నిఖిల, ’కొట్టుకాలి’ మూవీలో నటించిన అన్నా బెన్ , తంగలాన్ సినిమాతో పార్వతి అచ్చం గ్రావిూణ మహిళలుగా మారి తమ నటనతో ప్రాణం పోస్తున్నారు. ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఈ ముగ్గురు యువ హీరోయిన్లు తమ పాత్రల్లో జీవించారంటూ ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారని ఆయా చిత్ర యూనిట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తమిళ చిత్రపరిశ్రమలో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లు ఆధిపత్యం చెలాయిస్తుంటారు. కోలీవుడ్ దర్శకులు సైతం అందానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నటీనటుల ప్రతిభకు పెద్దపీట వేసి హీరోయిన్లను ఎంపిక చేస్తుంటారు. ఆ కోవలోనే మాలీవుడ్‌కు చెందిన యువ కథానాయికలకు దర్శకులు అవకాశాలు ఇస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అలా వచ్చిన అవకాశాన్ని కూడా ఈ యువ హీరోయిన్లు సద్వినియోగం చేసుకుంటూ సినీ రంగంలో స్థిరపడిపోతున్నారు.
ఇంకా చదవండి: అలీభాయ్‌గా ప్రకాశ్ రాజ్ లాస్ట్ ఛాయిస్!
# NikhilaVimal # AnnaBen # RajishaVijayan