ముద్దు సీన్లలో నటించడం అంత తేలిక కాదు: మాళవికా మోహనన్
3 months ago | 31 Views
'మాస్టర్’, 'తంగలాన్’ వంటి చిత్రాలతో దక్షిణాది వారికి చేరువైన కేరళ బ్యూటీ మాళవికా మోహనన్ బాలీవుడ్ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆమె కథానాయికగా నటించిన హిందీ మూవీ 'యుధ్రా’ తో ఆమె బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్, ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేశారు. దీనిని ఉద్దేశించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటిమేట్ సీన్స్‌లో యాక్ట్ చేయడం అంత సులభం కాదన్నారు. ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు ఏ సినిమా సెట్‌లోనైనా ఇంటిమేట్ కో-ఆర్డినేటర్‌ను నియమిస్తున్నారు. నటీనటులు ఇబ్బందిపడకుండా ఆయా సన్నివేశాల్లో ఎలా యాక్ట్ చేయాలో వారు చెబుతుంటారు. అది చాలా మంచి నిర్ణయం. అయితే, మా సెట్‌లో అలాంటి కో-ఆర్డినేటర్స్ ఎవరూ లేరు.
'సాథియా’ పాట గురించి చెప్పినప్పుడు సిద్దాంత్, నేను మొదట కంగారుపడ్డాం. 'దీనిని మనం చేయగలమా’ అని సందేహం వ్యక్తంచేశాం. సముద్ర తీరం, అందులోనూ చలి తీవ్రత తట్టుకోలేక.. ఏదో ఒకరకంగా దీనిని పూర్తి చేసేయడం మంచిదని భావించి.. దర్శకుడు చెప్పినవిధంగా చేసేశాం. ఇంటిమేట్, లేదా ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేయడం అంత సులభం కాదు. నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలి. సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలని మాళవిక తెలిపారు. యాక్షన్ ఫిల్మ్‌గా 'యుధ్రా’ సిద్ధమైంది. శ్రీధర్ రాఘవన్ కథ రాయగా.. రవి ఉద్యావర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటించారు. సెప్టెంబర్ 20న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినీప్రియులను ఆకట్టుకున్నాయి. ఇటీవల 'సాథియా’ పాట విడుదలైంది. ఈ పాటలో సిద్దాంత్ -మాళవికపై చిత్రీకరించిన పలు సన్నివేశాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'యుధ్రా’లో యాక్ట్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మాళవిక పలు సందర్భాల్లో తెలిపారు. హిందీ ప్రేక్షకులు సైతం తనని ఆదరించాలని కోరుకున్నారు.
ఇంకా చదవండి: అసభ్యంగా తాకిన వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించా: నటి ఈషా డియోల్ స్వానుభవం!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# MalavikaMohanan # Siddhant # Yudhaa