కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తా : హీరోయిన్ నిత్యా మీనన్

కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తా : హీరోయిన్ నిత్యా మీనన్

1 month ago | 5 Views

వెండితెరపై ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం మెండుగా, నిండుగా కలిగిన సుందరీ మణులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారి జాబితాలో ఎప్పుడూ ఉండే ఒక పేరు నిత్యా మీనన్ . మలయాళీ అయినప్పటికీ.. తెలుగు నేర్చుకొని మరీ, తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పుకొనే స్థాయికి ఎదిగింది ఆమె. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించగలిగే టాలెంట్‌ ఆమె సొంతం. ముందు నుంచీ గ్లామర్‌ పాత్రలపై ఎలాంటి ఆసక్తి చూపకుండా.. కేవలం తన అభినయానికే మొదటి ప్రాధాన్యతనిచ్చిన ఆ బ్యూటీ తెలుగులో ఎన్నో మెమరబుల్‌ మూవీస్‌లో నటించి ప్రేక్షకుల ఆరాధ్య కథానాయిక అయింది. అయితే ఇటీవల ఆమె ధనుష్‌  హీరోగా నటించిన 'తిరుచిత్రాంబళం’ అనే తమిళ సినిమాకి జాతీయ అవార్డు పొందారు. కాగా ఈ విషయంపై విమర్శలు నెలకొన్నాయి.

అవార్డులు ప్రకటించి చాలా రోజులే అవుతున్న ఇంకా కొందరు ఆమెపై విమర్శలు చేస్తూనే ఉన్నారట. ఒకవైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే.. కథలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ.. నిత్య సౌత్‌ ఇండస్ట్రీలోనే  ఒక ఐకానిక్‌ హీరోయిన్‌ గా నిలిచారు. ఇటీవల ఆమె 'తిరుచిత్రాంబళం’ తమిళ చిత్రానికి ఉత్తమ జాతీయ నటిగా అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక కమర్షియల్‌ సినిమాలో నటించిన హీరోయిన్‌ కి జాతీయ అవార్డు ఇవ్వడం ఏంటని పలు విమర్శలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పటికి ఆ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయట. దీనిపై నిత్యా మీనన్  క్లారిటీ ఇస్తూ.. 'నేను జాతీయ అవార్డుల జ్యూరీని కలిశానన్నారు. వారు కేవలం నా 'తిరుచిత్రాంబళం' చిత్రానికే కాకుండా నాలో ఉన్న కళాకారిణిని, నా కెరీర్‌ను చూసి ఈ వార్డు ఇచ్చారని. అందుకే ఈ అవార్డును చాలా గొప్పగా భావిస్తాను‘ అని చెప్పొకొచ్చారు. ఇక తన లుక్స్‌ విషయంలోనూ తరచుగా విమర్శలతో స్ట్రెస్ ని  ఎదురుకుంటానని అన్నారు.

నాకు ఎలా ఉండాలనిపిస్తే ఆలా ఉంటా, కొన్ని మూవీస్‌లో నన్ను ఇలాగే ఉండాలంటూ ఫోర్స్‌ చేశారు.. కానీ నేను వాటికి లొంగలేదన్నారు. నా వెయిట్‌ గురించి కామెంట్‌ చేసే వాళ్ళు ఎక్కువ, మనస్ఫూర్తిగా కాంప్లిమెంట్స్‌ ఇచ్చేవారు తక్కువ అని తెలిపింది. అయితే సినిమాలో నా క్యారెక్టర్‌ ఫిట్‌ అయినట్లు అనిపిస్తేనే ఏదైనా ప్రాజెక్ట్‌కి ఓకే చెప్తానన్నారు. సినిమా రిజల్ట్స్‌ గురించి తాను ఆలోచించన్నారు. ఇక స్టోరీ అర్థం కాకపోతే ఎలాంటి సినిమాకైనా నో చెప్తానంది.

ఇంకా చదవండి: ప్రేమించే టైమ్ లేదు: సునయన

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# నిత్యా మీనన్     # టాలీవుడ్    

trending

View More