42 ఏళ్ల అమ్మాయితో అభిషేక్ బచ్చన్ ప్రేమకలాపం..!
1 month ago | 5 Views
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వీరిద్దరి విడాకుల గురించే చర్చ నడుస్తుంది. మరోవైపు నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ డేటింగ్ అంటూ మరో చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఇది కేవలం రూమర్స్ మాత్రమే. ఇప్పటివరకు దీనిపై అభిషేక్, ఐశ్వర్య స్పందించలేదు. నిమ్రత్ పేరు అభిషేక్‌తో కలిపి చర్చనీయాంశం కావడంతో ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని అభిమానులు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు.. ? బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనే విషయాలపై చర్చ నడుస్తోంది. ఇక నిమ్రత్ కూడా 42 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉంది.
నిమ్రత్ కౌర్ తండ్రిని కశ్మీర్‌లో తిరుగుబాటుదారులు హతమార్చారు. ఈ సంఘటన తర్వాత నిమ్రత్ కుటుంబ జీవితం పూర్తిగా మారిపోయింది. ఘటన అనంతరం నటి కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన నిమ్రత్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ ప్రారంభించిన తర్వాత, నిమ్రత్‌కు చాలా ప్రకటనలలో నటించే అవకాశం వచ్చింది. నిమ్రత్ 2006లో విడుదలైన వన్ నైట్ విత్ ది కింగ్ చిత్రంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ 2012లో విడుదలైన ‘పెడ్లర్స్’ సినిమా ఈ నటికి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామకు ‘లంచ్‌బాక్స్’ సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘దసవి’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. సినిమాలో అభిషేక్ భార్య పాత్రలో నిమ్రత్ నటించింది. అప్పటి నుంచే వీరిద్దరీ మధ్య రిలేషన్ మొదలైనట్టు టాక్.
ఇంకా చదవండి: రూ. 7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్‌చరణ్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# అభిషేక్ బచ్చన్ # ఐశ్వర్య రాయ్ # నిమ్రత్ కౌర్