సుశాంత్‌ ఇంటిని కొనేసిన ఆదాశర్మ.. పబ్లిసిటీ కోసమే అన్న విమర్శలను తోసిపుచ్చిన నటి

సుశాంత్‌ ఇంటిని కొనేసిన ఆదాశర్మ.. పబ్లిసిటీ కోసమే అన్న విమర్శలను తోసిపుచ్చిన నటి

6 months ago | 5 Views

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని నటి ఆదాశర్మ కొనుగోలు చేసిన తరవాత ఆ ఇంటిని రీమోడలింగ్‌ చేసి ఇటీవలే కుటుంబంతో సహా అక్కడికి షిప్ట్‌ అయ్యారు. అయితే.. ఆమె పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వీటిపై ఆదా స్పందించారు. ఒక నటిగా తనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఇలాంటివాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ఆ ఇంటిని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 'మన జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అభిప్రాయాలు తెలపడానికి మన దేశంలో పూర్తి హక్కు ఉంటుంది. నేను ఈ ఇంటిని కొనుగోలు చేయడంపై కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడించారు.   'నేను మంచి వ్యక్తిని’ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు చేయాలనిపించినది నేను చేశా.

Adah Sharma dismisses rumors of buying SSR property - TheDailyGuardian

నా కోసం ఎవరూ మారకూడదని నేను అనుకుంటాను. అదే రూల్‌ ఇతరులకు వర్తిస్తుంది. వారి కోసం నేను నా పద్ధతిని మార్చుకోను’ అని చెప్పారు. ఇక సుశాంత్‌ ఇంటి గురించి మాట్లాడుతూ.. 'నాకు ఈ ఇల్లు ఎంతో నచ్చింది. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఇక్కడ ఉంటున్నాను. ఈ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉంది’ అని తెలిపారు. గతంలోనూ ఈ ఇంటిపై ఆదా ఇలాంటి కామెంట్సే చేశారు. సుశాంత్‌ ఇంటిని చూడగానే తనకు ఎంతో పాజిటివ్‌గా అనిపించిందన్నారు. అందుకే కొన్నట్లు వెల్లడించారు.  మొత్తం రీమోడలింగ్‌ చేశానన్నారు. మొదటి అంతస్తుని గుడిలా మార్చేసి నట్లు చెప్పారు. ఒక గదిని మ్యూజిక్‌ రూమ్‌గా, మరో దాన్ని డ్యాన్స్‌ స్టూడియోగా చేశానన్నారు. టెర్రస్‌ మొత్తం సూపర్ గా మార్చేసినట్లు తెలిపారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 2020 జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలోనే ఉరి వేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల మానసిక కుంగుబాటుకు గురి కావడంతోనే ఆయన మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు అదే ఇంటిని ఆదా కొనుగోలు చేసి అందులోకి షిప్ట్‌ కావడంతో బాలీవుడ్‌లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి: మెగా రివ్యూ జరుపుకుంటున్న 'విశ్వంభర'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Aadasharma     # SushantSinghRajput     # Bollywood