పుష్ప 2 సినిమాకు వద్దనడంతో యువతి ఆత్మహత్యాయత్నం
4 hours ago | 5 Views
పుష్ప 2 సినిమాకి వెళదాం అంటే బాయ్ ఫ్రెండ్ వద్దనడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది .
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ ఘటన జరుగగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో కంటే నార్త్‌లోనే ఈ సినిమాని చూడటానికి జనాలు ఎక్కువగా క్యూ కడుతున్నారు. అయితే ఈ సినిమా చూడటానికి తన ప్రియుడు నిరాకరించాడన్న కారణంతో ఒక యువతి సుసైడ్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బనారస్ హిందూ యూనివర్శిటీ అనుబంధ కళాశాలలో చదువుతున్న 22 ఏండ్ల యువతి తన ప్రియుడితో కలిసి ట్రిప్? కోసం వారణాసి వెళ్లింది. ఇద్దరు కలిసి ఒక హోటల్‌లో దిగిన అనంతరం.. తనను పుష్ప 2 సినిమాకి తీసుకువెళ్లమని బాయ్ ఫ్రెండ్ కోరింది. అయితే ప్రియురాలి కోరికను అతడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.
ఇంకా చదవండి: అలాంటి అబ్బాయి కావాలి : రష్మిక మందన్న
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# పుష్ప 2 # అల్లు అర్జున్