భాగ్యశ్రీ బోర్సేకి వరుస ఆఫర్లు!

భాగ్యశ్రీ బోర్సేకి వరుస ఆఫర్లు!

1 month ago | 5 Views

ఔరా అనిపించే ఔరంగబాద్‌ అందం భాగ్యశ్రీ బోర్సే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. తమిళ అగ్ర కథానాయకుడు సూర్య సరసన నటించే ఛాన్స్‌ ఈ ముద్దుగుమ్మని వరించినట్టు చెన్నై మీడియాలో బలంగా వార్తలొస్తున్నాయి. సూర్య కథానాయకుడిగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటైర్టెన్మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీత దర్శకుడు.

ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఖాయం అయ్యిందట. మే నెలలో షూటింగ్‌ మొదలు కానున్నట్టు సమాచారం. తొలి సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’ ఫలితం ఎలా ఉన్నా.. భాగ్యశ్రీబోర్సే మాత్రం అందంతో మార్కులు కొట్టేసి యూత్‌ని కట్టిపడేసింది. అందుకే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కాంత’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నది భాగ్యశ్రీబోర్సే.

రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్ఘీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. రామ్‌ పోతినేని హీరోగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ఫేం మహేశ్‌బాబు తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ భాగ్యశ్రీనే కథానాయిక. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కింగ్‌డమ్‌’లోనూ భాగ్యశ్రీనే హీరోయిన్‌. ఈ లైనప్‌ని బట్టి చూస్తుంటే.. ఈ ముద్దుగుమ్మకు మహర్దశ మొదలైందనిపిస్తుంది.

ఇంకా చదవండి:  మంచుమనోజ్‌ అరెస్టు..?

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# భాగ్యశ్రీ బోర్సే     # టాలీవుడ్    

trending

View More