రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం!

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం!

3 days ago | 14 Views

'ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకధీరుడు రాజమౌళి. తాజాగా ఆయనతో పాటు ఆయన భార్య రమా రాజమౌళి కూడా అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఆస్కార్‌ అకాడవిూలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరిలో రాజమౌళి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి  ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడవిూ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడవిూ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.

తాజాగా దీనిపై అకాడవిూ పోస్ట్‌ చేస్తూ.. 'ఈ సంవత్సరం కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడవిూ స్వాగతం పలుకుతోంది’ అని పేర్కొంది. ఇక టాలీవుడ్‌ నుంచి గతేడాది కొందరు ప్రముఖులు ఈ అకాడవిూలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు కీరవాణి, సెంథిల్‌కుమార్‌ గతంలో ఈ అకాడవిూలో సభ్యత్వం సాధించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో చేయనున్న ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నారు. ఇందులో హాలీవుడ్‌ నటీనటులు భాగం కానున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి: అమర్‌ సింగ్‌ చంకీల కోసం 16 కిలోల బరువు పెరిగా...

# SS Rajamouli     # Mahesh Babu     # Tollywood