అనారోగ్యం వల్ల ఒక్కోసారి వైవాహిక జీవితంలో భారీ మూల్యం : విడాకులపై సమంత కామెంట్
1 month ago | 5 Views
అక్కినేని నాగచైతన్య, సమంత 2017లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ జంట... 2021లో విడాకులు తీసుకుంది. అయితే... విడాకులకు కారణాలు వీరిద్దరూ వేర్వేరుగా చెప్పడమే కొన్ని సార్లు చర్చనీయాంశం అవుతోంది. ఆ మధ్య ఓ పాడ్ కాస్ట్ లో నాగచైతన్య ‘తాను సమంత పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామ’ని చెప్పాడు. మా కున్న వ్యక్తిగత కారణాలతో ఎవరి మార్గంలో వారు ప్రయాణం చేయాలని అనుకున్నాం. అందుకే విడాకులు తీసుకున్నాం’ అని స్పష్టం చేశాడు. తాజాగా సమంత మాత్రం విడాకులు విషయంలో వేరే వర్షన్ ను చెప్పింది. ప్రతి మనిషి మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. అలా లేని పక్షంలో దాని ప్రభావం వైవాహిక జీవితం మీద పడుతుందని తెలిపింది.
జీవిత భాగస్వామి ఎంత విశాల హృదయుడైనా... ఎంత మనసున్నవాడైనా... ఒక్కోసారి పార్టనర్ అనారోగ్యం కారణంగా వారి మధ్య గ్యాప్ ఏర్పడుతుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. లైఫ్ పార్టనర్ పట్ల మనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కోసారి అనారోగ్యం అడ్డుపడుతూ ఉంటుందని, దాంతో భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చని నర్మగర్బంగా సెలవిచ్చింది. మొత్తం మీద తన అనారోగ్యమే విడాకులకు పరోక్షకారణమని చెప్పకనే సమంత చెప్పేసింది. ఇదిలా ఉంటే ఇటీవల శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్న నాగచైతన్య ‘తండేల్’ విజయంతో ముందుకు సాగిపోతున్నాడు. అలానే... సమంత విడాకుల అనంతరం వెబ్ సీరిస్ మీద దృష్టి పెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని నటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం నిర్మాతగానూ తన సత్తాను చాటాలని తహతహలాడుతోంది.
ఇంకా చదవండి: బ్యాగ్రౌండ్ లేకున్నా...తనదైన శైలిలో సినిమాలు...