రజనీకాంత్ సూచనతో ...'వేట్టయాన్' కథలో మార్పు
2 months ago | 5 Views
రజనీకాంత్ హీరోగా టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం 'వేట్టయన్’ భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా కథ గురించి రజనీ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టి.జె.జ్ఞానవేల్ మొదట తీసుకువచ్చిన కథకు రజనీ మార్పులు సూచించారట. దానిలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయమని కోరారట. కుమార్తె సౌందర్య సిఫార్సు మేరకు రజనీకాంత్ 'వేట్టయన్’ కథను విన్నట్లు చెప్పారు. ‘టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ’జైభీమ్’ సినిమా నాకెంతో నచ్చింది. కానీ, గతంలో జ్ఞానవేల్‌తో ఎప్పుడూ మాట్లాడే అవకాశం రాలేదు. ’వేట్టయన్’ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే, ఈ సినిమా తీయడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది.
అందుకే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని కోరాను. 10 రోజుల సమయం అడిగాడు. ’కమర్షియల్ సినిమాగా మారుస్తాను. కానీ, నెల్సన్ దిలీప్‌కుమార్, లోకేశ్ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేను. నా శైలిలో ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను మారుస్తాను’ అని జ్ఞానవేల్ చెప్పాడు. ’నాకు అదే కావాలి.. లేదంటే లోకేశ్, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా’ అని చెప్పా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను‘ అని రజనీకాంత్ తెలిపారు. ఈ సినిమాకు అనిరుధ్ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్ పట్టుపట్టినట్లు రజనీ గుర్తుచేసుకున్నారు. తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్ నేపథ్యంతో దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది రజనీకాంత్‌కు 170వ చిత్రం. ఆయన ఇందులో రిటైర్డ్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, రితికాసింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానుంది.
ఇంకా చదవండి: 'గేమ్ చేంజర్' టీజర్ డేట్ ఛేంజ్.. దసరాకు కాదు...దీపావళికి అంటూ తమన్ పోస్ట్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Vettaiyan # Rajinikanth # TJGyanvel