సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు
1 month ago | 5 Views
ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీతేజ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్రీతేజ్‌పై బీఎన్‌ఎన్ 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీతేజ్‌పై గతంలో కూడా ఇదే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీతేజ్ పెళ్లైయిన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. అక్రమ సంబంధం విషయం తెలిసి గుండెపోటుతో అప్పట్లో బ్యాంక్ ఉద్యోగి సురేశ్ మృతి చెందాడు. బ్యాంక్ ఉద్యోగి మృతితో గతంలో మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, పుష్ప ది రైజ్, మంగళవారం, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్ ప్రస్తుతం పుష్ప ది రూల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇంకా చదవండి: ఆయన నాకు తండ్రిలాంటి వారు : మోహిని
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# శ్రీతేజ్ # వంగవీటి # పుష్పదిరూల్