చిరుత వచ్చిదంటూ ప్రియాంకజైన్ ఫ్రాంక్.. కేసు నమోదు
24 days ago | 5 Views
బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘జానకి కలగనలేదు..’, ‘మౌన రాగం’ వంటి సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయ్యింది. తన అందం, అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7 లో అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో మెప్పించి ఏకంగా టాప్-5లో నిలిచింది. ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌తో కలిసి తరచూ ప్రాంక్ వీడియోలు చేస్తూ సందడి చేస్తుంటుంది. ఈ బుల్లితెర నటి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రియాంక జైన్.. తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే, అక్కడ కూడా ఓ ప్రాంక్ వీడియో చేసి నెట్టింట విమర్శలపాలవుతున్నారు ఈ లవ్‌బర్డ్స్. తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద వీరిద్దరూ కలిసి రీల్స్ చేశారు.
చిరుత వచ్చిందంటూ ఫేక్ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియోని తిరుమల దారిలో చిరుత ఎటాక్..? అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో వీడియో వదిలారు. చివరికి చిరుత లేదు.. అదంతా ప్రాంక్ అని నెటిజన్లను ఫూల్స్‌ని చేసేశారు. ప్రస్తుతం ఈ ప్రాంక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, శ్రీవారి భక్తులు ప్రియాంక జైన్ జంటపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం, తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా..వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.
ఇంకా చదవండి: సూర్య, రామ్ చరణ్ పేర్లు చెప్పిన డైరెక్టర్ నార్తన్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ప్రియాంక జైన్ # శివకుమార్