ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం
2 months ago | 5 Views
సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను ఆరాధిస్తుంటారు. సినిమాలో వాళ్ల నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో వాళ్ల మనసు, మంచితనం కూడా దీనిపై ఆధారపడి వుంటుంది. ఇలా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు కేవలం అభిమానులే కాదు ఆర్మీతో పాటు ఆయనన విపరీతంగా ఆరాధించే వాళ్లు కూడా వున్నారు. అందుకు అల్లు అర్జున్ అభిమానులతో ఎంతో ప్రేమగా వుండటమే కారణం. ఇక పుష్ప-2 చిత్రంతో భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయి ఆయనకు అభిమానులుగా మారారు. పుష్ప చిత్రంతో తగ్గేదెలే అంటూ ఆయన మేనరిజం స్వాగ్‌కు అందరూ పడిపోయారు.
ఇలా అల్లు అర్జున్‌ను అమితంగా ఇష్టపడే ఓ ఉత్తరప్రదేశ్ అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ నుండి ఐకాన్‌స్టార్‌ను కలవడానికి సైకిల్‌పై 1600 కిలోమీటర్లు ప్రయాణించి అల్లు అర్జున్‌ను చేరుకున్నాడు. తన అభిమాన హీరోని కలిసిన అతను కాసేపు ఆయనతో చిట్ చాట్ చేశాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో అల్లు అర్జున్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం చూడొచ్చు. తమ అభిమాన హీరోని కలిసిన ఆ అభిమాని ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిది. అల్లు అర్జున్ తన నిజమైన హీరోగా అభివర్ణించడం, అల్లు అర్జున్‌ను కలవడం తన జీవితంలో మరుపురాని అనుభూతిగా ఆ అభిమాని వర్ణించాడు. అంతేకాదు సైక్లింగ్ మొదలుపెట్టే ముందు చాలా సార్లు హనుమాన్ చాలిసా చదివానని ఈ సందర్భంగా ఆ అభిమాని తెలిపాడు.
ఇంకా చదవండి: ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన నేషనల్ క్రష్ రష్మిక మందన్న
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !