
ఫిబ్రవరి 15న జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ కి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా రావాలని కోరుకుంటున్నాను -నారా భువనేశ్వరి గారు
2 months ago | 5 Views
'బ్లడ్ డొనేషన్ సొసైటీకి చాలా గొప్ప డొనేషన్. మీరు ఇచ్చే ప్రతిరక్తపు బిందువు చాలా జీవితాలని నిలబెడుతుంది. ఈ గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా వచ్చి ఈ షోలో పాల్గోవాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది' అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈవో రాజేంద్ర కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సివోవో గోపి పాల్గొన్నారు.
ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ.. మా ఆహ్వానం అంగీకరించి ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. నాన్నగారు నందమూరి తారక రామారావు గారు.. అలా పిలిస్తే మీకు ఇష్టం ఉండదు.. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు.. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన మహోన్నత వ్యక్తి. ప్రజలే దేవుళ్ళు అని భావించి బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమీ ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రజల కోసం విప్లవాత్మకమైన పథకాలను ఎంతో ధైర్యంతో ముందుకు తీసుకువెళ్లారు. రెండు రూపాయలకి కిలో బియ్యం, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు.. ఇలా ఎన్నో పథకాలు తెలుగు జాతిని, ప్రజల్ని మనసులో పెట్టుకొని ముందుకు తీసుకువెళ్లారు. మన ప్రజా నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్యం అందుబాటులో వుండాలని ఎన్టీఆర్ మొమొరియల్ ట్రస్ట్ ని స్థాపించారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం సహాయం తీసుకోకుండా 28 ఏళ్లుగా ఈ ప్రయాణం కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఆశయాలని ట్రస్టు పాటిస్తోంది. ఆయన కలలని నెరవేర్చడానికి మేము ఎప్పుడూ ముందుంటాం.2013లో వచ్చిన పైలన్ తుఫాన్, 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్, 2018 కేరళ వచ్చిన తుఫాన్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందు అడుగేసి ప్రజల కావాల్సిన సహాయం అందించింది. ట్రస్ట్ ద్వారా ప్రజాసేవాలో అందరికంటే ముందుటాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా .. జెనిటిక్ డిసార్డర్ తలసేమియా తో చాలా మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారు. ఈ వ్యాధి వున్న వారికి బ్లడ్ లో హిమోబ్లోబిన్ చాలా తక్కువగా వుంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇది తీవ్రంగా వచ్చినప్పుడు రక్త మార్పిడి వెంటనే జరగాలి. దీనికి చాలా రక్తం అవసరం. బ్లడ్ డొనేషన్ పై ప్రజల్లో చాలా అపోహలు వున్నాయి. బ్లడ్ డొనేషన్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. నిపుణులు అన్ని పరిశీలించిన తర్వాత బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్ డొనేషన్ సొసైటీకి చాలా గొప్ప డొనేషన్. మీరు ఇచ్చే ప్రతిరక్తపు బిందువు చాలా జీవితాలని నిలబెడుతుంది. అది ప్రజలు గుర్తించాలి. ఈ గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి మాకు ముందు గుర్తుకు వచ్చింది ఎన్ తమన్ గారు .. సారీ నందమూరి తమన్ గారు(నవ్వుతూ). మా టీం ఆయన్ని కలసిన వెంటనే ఆయన ఒప్పుకున్నారు. మా ట్రస్ట్ తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా వచ్చి ఈ షోలో పాల్గోవాలని కోరుకుంటున్నాను. టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో వుంటాయి. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది. దానికి నేను గ్యారెంటీగా వుంటాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ మాట్లాడుతూ.. మహానీయులు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు స్థాపించిన ట్రస్ట్ ఎంతగొప్పదో మనం చుస్తున్నాం.ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఫిబ్రవరి 15 మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ షోలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. మేడం భువనేశ్వరి గారు చాలా గొప్ప మనిషి. చాలా డౌన్ టు ఎర్త్ వుంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మనం చూశాం. ఏపీని ప్రగతిపధం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ధన్యవాదాలు. ఈ మ్యూజికల్ షోలో సీనియర్ ఎన్టీఆర్ గారి పాటల నుంచి ఇప్పటి ట్రెండ్ పాటల వరకూ అన్నీ వుంటాయి. ఫెబ్రవరి ఫస్ట్ నుంచి రిహార్సల్ చేస్తున్నాం. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా క్రేజీగా ఉండబోతోంది. అందరికీ థాంక్ యూ సో మచ్' అన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈవో రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి అన్న ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆ మహానీయుని పేరు మీదున్న ట్రస్ట్ కి సిఈవో గా రావడం నా మహా భాగ్యం. మేడం నారా భువనేశ్వరి గారితో పని చేస్తూ నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. మేడం, ఎన్టీఆర్ గారి ఆశయాలు అనుగుణంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.
ఇంకా చదవండి: "గాంధీ తాత చెట్టు"లో ఎమోషన్స్ అందరి హృదయాలను హత్తుకుంటాయి: దర్శకురాలు మల్లాది పద్మ
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఎన్టీఆర్ # భువనేశ్వరి # ఎస్ఎస్తమన్