ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతున్న

ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతున్న "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"*

2 months ago | 5 Views

డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 ఓహా ఓటీటీలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ షో మీద ఉన్న క్రేజ్ తో ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఓహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. 


డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్ లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి.  డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ గురించి ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ - డ్యాన్స్ మీద ఉన్న ప్యాషన్ ను, డ్యాన్స్ చేయడంలో ఉన్న టాలెంట్ ను డ్యాన్స్ ఐకాన్ సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ తో మరింత వైడ్ రేంజ్ లో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాం. అన్నారు.

ఇంకా చదవండి: "గాంధీ తాత చెట్టు" సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకంలా ఉంటుంది: జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# డ్యాన్స్ ఐకాన్ 2     # ఓటీటీ    

trending

View More