మొదలైన తలపతి విజయ్‌ ఆఖరి చిత్రం

మొదలైన తలపతి విజయ్‌ ఆఖరి చిత్రం

2 hours ago | 5 Views

తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్నచిత్రం ‘తలపతి 69’ ఈ చిత్రంలో తలపతి విజయ్‌ హీరోగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు హెచ్‌ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడం విశేషం. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. అలాగే మలయాళ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మమతా బాయిజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నటులు ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి, నరేన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ వంటి సీనియర్‌ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్‌ రవిచందర్‌ అందిస్తున్నారు. విజయ్‌ - అనిరుధ్‌ కాంబినేషన్‌ గతంలో పలు విజయాలను అందించినందున, ఈసారి మళ్లీ మాజిక్‌ చేసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘తలపతి 69’ చిత్రం పూజా  కార్యక్రమం గ్రాండ్‌గా జరగగా, ఇందులో విజయ్‌, హెచ్‌ వినోద్ .. మిగతా తారాగణం హాజరయ్యారు. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. విజయ్‌ అభిమానులకు ఈ చిత్రం పండగలాంటిదిగా భావిస్తారు.  ఇది విజయ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఇంకా చదవండి: రవితేజ షూటింగ్‌ ప్రారంభానికి యూనిట్‌ సిద్దమవుతోంది ...

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Thalapathy69     # Vijay     # HVinoth     # PoojaHegde     # BobbyDeol    

trending

View More