'జీబ్రా' ఫస్ట్ లుక్ అదుర్స్!
3 months ago | 37 Views
సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించి.. జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్. ఆయన సినిమాలు భారీ రేంజ్‌లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్‌ఫార్మ్ చేస్తుంటాయి. కెరీర్ బిగెనింగ్ నుంచి సత్యదేవ్ కథా బలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా మధ్య మధ్యలో కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో 'జీబ్రా’ ఒకటి. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ నుంచి విడుదల తేదీని లాక్ చేశారు మేకర్స్.
ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్టీమ్రింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీలో సత్య సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్, నటిస్తుంది. పుష్పా సినిమాతో ఫేమస్ అయిన ధనంజయ (జాలిరెడ్డి) ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇంకా చదవండి: రజనీ స్టయిల్ కు భిన్నంగా 'వేట్టయాన్'... రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Zebra # SatyadevKancharana # PriyaBhavaniShankar