యంగ్ చాప్ నందమూరి తారక రామారావు స్పెషల్ పోస్టర్ విడుదల
7 days ago | 5 Views
లెజెండరీ నటుడు ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు నటుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని దీపావళి కానుకగా విడుదల చేసిన విషయం తెలిసిందే. యంగ్ చాప్ నందమూరి తారక రామారావు పుట్టిన రోజు కావడంతో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి స్పెషల్ పోస్టర్ తో పాటు స్పెషల్ మెసేజ్ ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ని ‘న్యూ టాలెంట్ రోర్స్ ఏ’ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లోస్టైలిష్ లుక్‌లో ఎన్టీయార్ ఆకట్టుకుంటున్నాడు. అందరికీ నమస్కారం, ‘అడవి రాముడు’ సినిమాలో విశ్వవిఖ్యాత ‘ఎన్.టి.ఆర్.’గారి పాత్ర.. అడవికి తిరిగి రాక సందర్భంగా.. ‘ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు.. ఎన్నెల్లు తిరిగొచ్చే మాకళ్ళకు..’ అని పాడుకుంటూ గూడెం ప్రజానీకం సంబరాలు చేసుకున్న చందాన.. డైనమిక్ డైరెక్టర్ ‘వై.వి.ఎస్.చౌదరి’ దర్శకత్వంలో మా ‘న్యూ టాలెంట్ రోర్స్ ఏ ‘ సంస్థ.. విశ్వవిఖ్యాత ‘ఎన్.టి.ఆర్.’ గారి ముని మనవడు ‘నందమూరి తారక రామారావు’ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. ఇటీవల విడుదల చేసిన ‘షో రీల్’కు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘తెలుగు’ సినిమా ప్రేక్షకులు మరియు ‘నందమూరి’ వంశ వీరాభిమానులు, ఇతర ‘తెలుగు’ కథానాయకుల అభిమానులందరూ ‘బ్రహ్మరథం’ పట్టారు.
అంతేకాకుండా.. ‘నందమూరి’ కుటుంబానికి సంబంధించిన ‘ప్రతి ఒక్కరూ’ వ్యక్తిగతంగానూ.. మరియు శ్రీమతి నారా భువనేశ్వరి, 'కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు.. సోషల్ మీడియా ద్వారా.. ఇంకా అనేకమంది సినీ, రాజకీయ, వ్యాపార మరియూ ఇతర రంగాల ప్రముఖులెందరో.. మా నందమూరి తారకరామారావు (ఎన్.టి.ఆర్.)ని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ తమ శుభాకాంక్షలను తెలియజేశారు. మా కథానాయకుడైన నందమూరి తారక రామారావుకి ఇంతటి అత్యద్భుతమైన స్పందన, ప్రశంసలు అందుతున్న సందర్భంలో.. మా ‘న్యూ టాలెంట్ రోర్స్ ఏ’ సంస్థ.. ఆనందంతో ఉప్పొంగిపోతూ.. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది. ‘భువి’ నుంచి వీరందరి ఆశీస్సులతో పాటు.. ‘దివి’ నుంచీ విశ్వవిఖ్యాత ఎన్.టి.ఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి జానకిరామ్ ల ఆశీస్సులు.. మా కథానాయకునికి, మా సంస్థకి ఎప్పటికీ లభిస్తూనే ఉంటాయి.
ఇంకా చదవండి: ఇండియన్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' జనవరి 3, 2025న జపాన్‌లో రిలీజ్