డిస్నీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైన 'యక్షిణి' వెబ్‌ సీరిస్‌!

డిస్నీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైన 'యక్షిణి' వెబ్‌ సీరిస్‌!

4 months ago | 33 Views

ఇప్పటికే డిఫరెంట్‌ ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ లతో ఓటీటీ అభిమానులకు ఫేవరేట్‌ గా మారింది డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌.  ఈ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ త్వరలో 'యక్షిణి'అనే మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ ను బాహుబలి ప్రొడక్షన్‌ హౌస్‌ 'ఆర్కా విూడియా వర్క్స్‌’ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు.ఈ సిరీస్‌తో వేదిక, మంచు లక్ష్మి , రాహుల్‌ విజయ్‌, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్‌,  కోట బొమ్మాళి పీఎస్‌ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని 'యక్షిణి' సిరీస్‌ ను రూపొందిస్తున్నారు. రీసెంట్‌ గా 'యక్షిణి’ కమింగ్‌ సూన్‌ అంటూ ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

Yakshini to Stream Shortly on Disney Plus Hotstar - businessoftollywood

ఇప్పటి దాకా వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లకు భిన్నమైన కాన్సెప్ట్‌ తో 'యక్షిణి’ని రూపొందించారు. ఈ సిరీస్‌ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.  తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో 'యక్షిణి వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కు  రాబోతోంది.

ఇంకా చదవండి: ఊపందుకున్న పీరియాడిక్‌ కథల జోరు!

# Yakshini     # ManchuLakshmi     # Disney+Hotstar     # TeluguCinema    

trending

View More