డిసెంబర్‌కి నిజంగా 'గేమ్‌ చేంజర్‌’ విడుదల ఉంటుందా?

డిసెంబర్‌కి నిజంగా 'గేమ్‌ చేంజర్‌’ విడుదల ఉంటుందా?

4 months ago | 42 Views

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం 'గేమ్‌ చేంజర్‌’ మూవీ విూద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్‌, 'జరగండి జరగండి..’ సాంగ్‌ మినహా సరైన అప్డేట్‌ మాత్రం ఇప్పటి వరకు మేకర్స్‌ నుంచి రాలేదనే చెప్పుకోవాలి. ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు.. ఇకపై అప్డేట్స్‌ బీభత్సంగా ఉంటాయనేలా హింట్‌ వచ్చేసింది. అవును.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్‌ ఓ అధికారిక అప్డేట్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముగించుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలను  జరుపుకుంటున్నట్లుగా.. అందుకు సంబంధించిన ఫొటోలతో మేకర్స్‌ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు ఫ్యాన్స్‌కు ఉన్న అనుమానాలు తొలగినట్లయింది. ఇంత వరకు సినిమా షూటింగ్‌ ఏ స్టేజ్‌లో ఉందో తెలియందు.

డిసెంబర్‌ రిలీజ్‌ అంటున్నారా? డిసెంబర్‌కి నిజంగా 'గేమ్‌ చేంజర్‌’ విడుదల ఉంటుందా? అనే మెగాభిమానులకు ఈ అప్డేట్‌ కాస్త క్లారిటీని ఇచ్చినట్లయింది. దీంతో.. 'గేమ్‌ చేంజర్‌’ ట్యాగ్‌ని వారు వైరల్‌ చేస్తూ.. ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.విలక్షణ నటుడు ఎస్‌.జె. సూర్య కూడా ట్విట్టర్‌ వేదికగా ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు యమా జోరుగా జరుగుతున్నట్లుగా వెల్లడించారు . రీసెంట్‌గా హీరోయిన్‌ కియారా అద్వానీ పుట్టినరోజును పురస్కరించుకుని 'గేమ్‌ చేంజర్‌’ నుంచి ఆమె లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

చూపు తిప్పుకోవటం కష్టం అనేంత బ్యూటీగా కియారా ఈ లుక్‌లో కట్టి పడేసింది. ఇక లార్జర్‌ దేన్‌ లైఫ్‌ చిత్రాలను అబ్బురపరిచే రీతిలో తెరకెక్కించే శంకర్‌ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను మించేలా 'గేమ్‌ చేంజర్‌’ను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. 'గేమ్‌ చేంజర్‌’ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. క్రిస్మస్‌  సందర్భంగా ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఇంకా చదవండి: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా "కాలం రాసిన కథలు" ట్రైలర్ లాంచ్

# GameChanger     # RamCharan     # KiaraAdvani     # NaveenChandra    

trending

View More