అవకాశాల కోసం ఎదురుచూడ్డం కాదు మనమే అవకాశాలు సృష్టిoచుకోవాలి -రైజింగ్ స్టార్ రుషి కిరణ్
1 month ago | 5 Views
కొంతమంది సినిమా ప్రారంభానికి ముందే చేయబోయే సినిమా గురించి పబ్లిసిటీ చేయాలసుకుంటారు. కాని "రుషి కిరణ్" మాత్రం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తరువాత పబ్లిసిటీకి ముందడగు వేసారు, ఇంతకి ఎవరీ రుషి కిరణ్ అనుకుంటున్నారా? గుంటూరుకు చెందిన "గుడిపల్లి కిరణ్ కుమారే" ఈ రుషి కిరణ్. నటుడిగా రాణించాలనే తపనతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి... ఎన్నో ప్రయత్నాలు చేస్తూ...
"సస్పెక్ట్" సినిమాతో హీరో అయ్యారు. "సస్పెక్ట్" పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగానీ.. "మోక్షం" సినిమాలో కూడా హీరోగా ఎంపికయ్యాడు. యాక్టింగ్ పరంగా
కన్నడ శోభరాజ్, టార్జాన్, ఆనంద భారతి లాంటి సీనియర్ కళాకారులతో శభాష్ అనిపించుకున్న కిరణ్ కుమార్ సినిమాల కోసం "రుషి కిరణ్" గా మారాడు!!
ఈరోజు (నవంబర్ 10) తన జన్మదినం సందర్భంగా తను నటించిన "సస్పెక్ట్" మరియు "మోక్షం" సినిమా పోస్టర్లను సోషియల్ మీడియాలో విడుదల చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవ్వరినీ పిలిచి అవకాశాలు ఇవ్వరు. మనమే సృష్టించుకోవాలి. దానికోసం అహర్నిశలు కృషి చేయాలని ప్రకటించారు. తను చేసిన రెండు సినిమాల యాక్టింగ్ చూసి "పోలీస్ పటేల్, ఈ సినిమా కు క్లైమాక్స్ ఉండదు" అనే ఇంకో రెండు సినిమాల్లో అవకాశం వచ్చిందని రుషి కిరణ్ తెలిపారు!!
ఇంకా చదవండి: ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో ఇండియన్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ మాసివ్ ఈవెంట్స్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# రుషికిరణ్ # సోషియల్మీడియా