'సంక్రాంతికి మీ ఇంటికొస్తున్నాం' : విక్టరీ వెంకటేష్

'సంక్రాంతికి మీ ఇంటికొస్తున్నాం' : విక్టరీ వెంకటేష్

2 days ago | 5 Views

క్లాస్‌, మాస్‌, కామెడీ, ఫ్యామిలీ.. ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్‌ విక్టరీ వెంకటేష్.  తనదైన కామిక్‌ స్టయిల్ ఆఫ్‌ యాక్షన్‌తో ఎంటర్‌టైన్‌ చేసే వెంకీమామ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు, మూవీ లవర్స్‌, ఫాలోవర్లు వెంకీ మామకు బర్త్‌ డే విషెస్‌ తెలియజేశారు. తాజాగా అనిల్‌ రావిపూడి టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా  నుంచి మీను సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు.


మీనాక్షి చౌదరి గురించి ఈ పాట ఉండబోతున్నట్టు ప్రోమో చెబుతోంది. సాంగ్‌లో వెంకీ పోలీసాఫీసర్‌గా సూపర్‌ స్టయిలిష్ గా  కనిపిస్తూ ఘర్షణ సినిమాను మరోసారి గుర్తుకు తెస్తున్నాడు.ఇప్పటికే  గోదారి గట్టు మీద రామసిలకవే.. ఓ.. గోరింటాకెట్టుకున్న సందమామవే అంటూ సాగే ఫస్ట్‌ సింగిల్‌కు నెట్టింట సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది.


భాస్కర భట్ల రాసిన ఈ పాటను రమణ గోగుల, మధుప్రియ పాడగా.. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో పాపులర్‌ మరాఠీ యాక్టర్‌, యానిమల్‌ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్‌ నటుడు వీటీవీ గణేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు.

ఇంకా చదవండి: గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న 'డాకు మహారాజ్‌'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సంక్రాంతికివస్తున్నాం     # వెంకటేష్     # అనిల్‌రావిపూడి    

trending

View More