'విశ్వంభర’ పోస్టర్‌ వచ్చేసింది!

'విశ్వంభర’ పోస్టర్‌ వచ్చేసింది!

27 days ago | 17 Views

పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత, మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ నింపేందుకు 'విశ్వంభర' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది యూవీ క్రియేషన్స్‌ సంస్థ. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ 'విశ్వంభర’. ‘బింబిసార’ విజయం తర్వాత వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. విక్రమ్‌, వంశీధర్‌ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్‌ నిర్మాతలు. త్రిష, ఆషిక రంగనాథ్‌ ఈ సినిమాలో హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు.  చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా, అభిమానులకు కానుకగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు.

ఈ పోస్టర్‌ చూస్తుంటే వావ్‌ అనిపిస్తుంది. పోస్టర్‌ లో చిరంజీవి త్రిశూలం పట్టుకొని ఓ భారీ కొండపై కొత్త లోకంలోకి వెళ్తున్నట్టు ఉంది. పోస్టర్‌ చూస్తేనే సినిమా దానికి తగ్గట్టు ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మెగాస్టార్‌ పుట్టిన రోజున ఇలాంటి పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయడంతో ఈ పోస్టర్‌ వైరల్‌ గా మారింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10 న రిలీజ్‌ కాబోతుంది.

ఇంకా చదవండి: మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లుక్ విడుదల

# Vishwambhara     # Chiranjeevi     # TrishaKrishnan    

trending

View More