పోలీస్‌గా విశ్వక్‌సేన్ కొత్త మూవీ!
4 months ago | 40 Views
టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండగా.. తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. విఎస్13 వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్ విడుదల చేశారు. శ్రీధర్ గంట దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది.
’కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ దీనికి స్వరాలు అందించనున్నారు. పోస్టర్ చూస్తే ఇందులోవిశ్వక్‌సేన్ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ఇది రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం విశ్వక్‌సేన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ’మెకానిక్ రాకీ’లో నటిస్తున్నారు. రాకీగా ఆయన మాస్ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో విూనాక్షి చౌదరి కథానాయిక. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. దీనితో పాటు ఇటీవల ’లైలా’ అనే కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. సన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విభిన్నమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు కూడా ప్రాధాన్యముందని సమాచారం.
ఇంకా చదవండి: మాస్టర్ పీస్ మూవీ సూపర్ డీలక్స్ 400+ థియేటర్లలో ఆగస్టు 9న గ్రాండ్ రిలీజ్
# VS13 # VishwakSen # MeenakshiChaudhary