విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్
2 months ago | 5 Views
ప్రేక్షకులని అలరించే అద్భుతమైన కంటెంట్ ని అందిస్తున్న ఆహా ఓటీటీలో మరో ఎక్సయిటింగ్ మూవీ స్ట్రీమింగ్ లోకి వస్తోంది. విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య లీడ్ రోల్స్ లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్'. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ సూపర్ హిట్ టగరు సినిమాకి రీమేక్ ఇది.
కార్తీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే తమిళ్ లో విడుదలైన సూపర్ హిట్ అయ్యింది. ఎక్సయిటింగ్ థ్రిల్ యాక్షన్ తో ఆడియన్స్ కట్టిపడేసిన ఈ మూవీ భవానీ మీడియా ద్వారా ఈ రోజు రాత్రి (అక్టోబరు 19)నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
అనంతిక సనిల్ కుమార్, రిషి రిత్విక్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సామ్ సిహెచ్ అందించిన మ్యూజిక్ మరో ప్రత్యేక ఆకర్షణ. విక్రమ్ ప్రభు సాలిడ్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే ఈ థ్రిల్లర్ ని ఆహాలో ఈ వీకెండ్ మిస్ అవ్వద్దు.
ఇంకా చదవండి: 'శంబాల' ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Raid # VikramPrabhu # SriDivya