ఓ దీవి నేపథ్యంగా విజయ్ 'తుఫాన్'
5 months ago | 53 Views
విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం 'తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ’తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది.
ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డామన్ లలో చిత్రీకరించాం. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు, ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు కూడా ఇదే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం’ అని మేకర్స్ అన్నారు. విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ.
ఇంకా చదవండి: 'గేమ్ ఛేంజర్'తో నా కల నెరవేరింది.. దర్శకుడు శంకర్ ఆసక్తికర ప్రకటన
# Toofan # Vijay Antony # Sathyaraj # R Sarathkumar # August2