చైనాలో విజయ్‌ సేతుపతి చిత్రం 'మహారాజ'

చైనాలో విజయ్‌ సేతుపతి చిత్రం 'మహారాజ'

1 month ago | 5 Views

కోలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి కాంపౌండ్‌ వచ్చిన చిత్రం 'మహారాజ'. కురంగు బొమ్మై ఫేం నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వంలో మక్కళ్‌ సెల్వన్‌ 50గా వచ్చిన ఈ చిత్రం జూన్‌ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. 'మహారాజ' 28 రోజుల థియాట్రికల్‌ రన్‌ తర్వాత పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా జులై 12న డిజిటల్‌ డెబ్యూ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ గ్లోబల్‌ చార్ట్స్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. 'మహారాజ' ఇక చైనీస్‌ భాషలో సందడి చేయనుంది. చైనాలో భారీ స్థాయిలో విడుదలవుతూ అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకోబోతుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్‌ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'మహారాజ' నవంబర్‌ 29న చైనా వ్యాప్తంగా 40 వేలకుపైగా స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. చైనా ఫిలిం ప్రొడక్షన్‌ కంపెనీ అలీబాబా పిక్చర్స్‌తో భాగస్వామ్యమవుతూ చైనాలో భారీ సంఖ్యలో విడుదల చేస్తున్న భారతీయ సినిమాగా 'మహారాజ' నిలువనుంది. మరి తెలుగు సినిమాను చైనా ప్రేక్షకుల ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇంకా చదవండి: ఓటీటీ ప్లాట్‌పాంపైకి ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# మహారాజ     # విజయ్‌ సేతుపతి    

trending

View More