విజయ్ దేవరకొండ చిత్రం వచ్చే ఏడాదికి విడుదల!
4 months ago | 44 Views
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం 'వీడీ 12’ నుంచి పోస్టర్ వచ్చి నెలలు గడిచిపోవడంతో అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ నిర్మాత ఓ పోస్టర్ షేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపారు. 7 ఏళ్లుగా గౌతమ్ తిన్ననూరితో కలిసి వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనపై నమ్మకంతో చెబుతున్నాను.. ఈసారి మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండను పవర్‌ఫుల్ పాత్రలో చూడబోతున్నారు.ఆగస్టులోనే దీని టైటిల్‌ను ప్రకటిస్తాం అని పేర్కొన్నారు.'విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు’ అనే క్యాప్షన్‌ను పంచుకున్నారు.
పస్తుతం దీని షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ కాగా.. నిర్మాణసంస్థ స్పందించింది. డియర్ రౌడీ ఫ్యాన్స్.. విూకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు టీమ్ ఎంతో కష్టపడుతోంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. లీక్ అయిన ఫొటోను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇందులో విజయ్‌దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఇంకా చదవండి: ఓటిటిలోకి ప్రియదర్శి 'డార్లింగ్'
# VD12 # VijayDeverakonda # Parasuram # March28