రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్

రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్"

4 months ago | 38 Views

హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ "తుఫాన్" రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ అదే సక్సెస్ రిపీట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. "తుఫాన్" సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్నీక్ పీక్ సినిమాపై అంచనాలు పెంచింది. సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన "తుఫాన్" సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా  రేపు (ఈ నెల 9న) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

"తుఫాన్" సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందించారు దర్శకుడు విజయ్ మిల్టన్. ఆడియన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వబోతోంది "తుఫాన్" మూవీ.


నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్

డిజైనర్ - తండోరా చంద్రు

యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్

ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి

ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్

మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ

డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా

రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్

ఇంకా చదవండి: బెంగ‌ళూరులో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన రాకింగ్ స్టార్ య‌శ్‌ భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’

# Toofan     # VijayAntony     # Sathyaraj     # RSarathkumar    

trending

View More