విజయ్ ఆంటోనీ యాక్షన్ థ్రిల్లర్ "హిట్లర్" ట్రైలర్ రిలీజ్, ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
3 months ago | 41 Views
పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా "హిట్లర్"తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో "విజయ్ రాఘవన్" అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా "హిట్లర్" సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. "హిట్లర్" సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. "హిట్లర్" సినిమా ఈ నెల 27న హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
"హిట్లర్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్ కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకున్న రొమాంటిక్ లవ్ స్టోరీని ట్రైలర్ లో రివీల్ చేశారు. దశాబ్దాలుగా రాజకీయ క్రీడలో ఆరితేరిన ఓ స్వార్థపూరిత నాయకుడి పాత్రలో చరణ్ రాజ్ కనిపిస్తారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో "హిట్లర్" ట్రైలర్ ఇంప్రెస్ చేస్తోంది. విజయ్ ఆంటోనీ పర్ ఫార్మెన్స్, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ట్రైలర్ కు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. విజయ్ ఆంటోనీ కెరీర్ లో "హిట్లర్" మరో వైవిధ్యమైన చిత్రంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.
నటీనటులు- విజయ్ ఆంటోనీ, రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు
టెక్నికల్ టీమ్ -
సినిమాటోగ్రఫీ - ననీన్ కుమార్.ఐ
సంగీతం- వివేక్, మెర్విన్
ఆర్ట్ - సి. ఉదయ్ కుమార్
ఎడిటింగ్ - సంగతమిజాన్.ఇ
కొరియోగ్రఫీ - బృందా, లీలావతి
స్టంట్స్ - జి.మురళి
కాస్ట్యూమ్- అనుష.జి.
పీఆర్వో- జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్స్ - డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్
రచన, దర్శకత్వం - ధన
ఇంకా చదవండి: 'కన్నప్ప' విధేయుడు..గుర్రం పోస్టర్ విడుదల!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Hitler # VijayAntony # RiyaSuman # GauthamVasudevMenon