అందరినీ ఆకట్టుకుంటున్న

అందరినీ ఆకట్టుకుంటున్న "వీక్షణం" సినిమా

2 months ago | 5 Views

వీక్షణం సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది ఆ వివరాల్లోకి వెళితే.. రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "వీక్షణం".  ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. "వీక్షణం" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఒకరోజు ముందుగానే  ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు.


హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ప్రీమియర్స్ అన్ని హౌస్ ఫుల్ అవ్వడం గమనార్హం. ప్రీమియర్స్లో సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. సినిమాలోని ట్విస్టులు అసలు ఊహకు అందేలా లేవని దర్శకుడికి ఇది మొదటి సినిమా లాగా ఏమాత్రం అనిపించడం లేదని సినిమా చూసినవారు అంటున్నారు. అలాగే సంగీత దర్శకుడు సాయి సమర్థ ఇచ్చిన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ప్రీమియర్స్ వేయడం పెద్ద సాహసంగా చెప్పాలి. ఎందుకంటే ప్రీమియర్స్ వేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే అక్కడే సినిమాకి ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడతాయి. కానీ ఈ సినిమాకి మాత్రం ప్రేక్షకులే ఆసక్తి కనబరిచి టికెట్లు బుక్ చేసుకుని ధియేటర్లకు రావడం గమనార్హం.

ఇంకా చదవండి: నివిన్‌ పౌలీ-నయనతార జంటగా రానున్న సరికొత్త సినిమా "డియర్‌ స్టూడెంట్స్‌"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Veekshanam     # Ramkarthik     # Kashvi    

trending

View More