'కంగువ'తో పోటీ పడనున్న 'వెట్టయాన్'
4 months ago | 45 Views
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ’వెట్టయాన్’. తెలుగులో వేటగాడు అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీని మొదట 2024 దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడిరచిన విషయం తెలిసిందే. అయితే తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు.
ఇప్పుడు తాజాగా తేదీని కూడా ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు వెల్లడిరచారు. అయితే ఇదే రోజున కోలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా రాబోతుంది. తమిళ స్టార్ నటుడు సూర్య శివ కాంబోలో కంగువ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇదే రోజున ఇప్పుడు రజినీకాంత్ వేటగాడు కూడా రాబోతుంది. దీంతో దసరా రోజు బిగ్ ్గªట్ జరుగనున్నట్లు తెలుస్తుంది.
ఇంకా చదవండి: 'దేవర'తో తెలుగులోకి జాన్వీ ఎంట్రీ!
# Vettaiyan # Thalaivar170 # Rajinikanth # AmitabhBachchan # ArjunSarja # FahadhFaasil