ఓటీటీ ప్లాట్‌ఫాం పైకి 'వెట్టైయాన్'
2 months ago | 5 Views
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం 'వెట్టైయాన్'. 'జై భీమ్' ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. వెట్టైయాన్ మిక్స్‌డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. కాగా ఇప్పుడిక డిజిటల్ ప్లాట్‌ఫాంకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. 'వెట్టైయాన్'పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. అయితే ప్రీమియర్ తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ మూవీలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ తెరకెక్కించారు. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు.. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉందంటూ బాధితురాలికి న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న సన్నివేశాలతో షురూ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!