సూర్య 44పై ఎంతో ఎక్జయింటింగ్‌

సూర్య 44పై ఎంతో ఎక్జయింటింగ్‌

1 month ago | 5 Views

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు డైరెక్ట్‌ చేస్తున్న సూర్య 44. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఓ ఇంటర్వ్యూలో కార్తీక్‌ సుబ్బరాజు క్లారిటీ ఇచ్చేశాడు. సూర్య 44 గ్యాంగ్‌స్టర్‌ మాత్రమే కాదు. ఇది చాలా యాక్షన్‌ పార్ట్‌తో కూడిన ప్రేమకథ. సూర్య అండ్‌ పూజా హెగ్డే లాంటి నటీనటులతో లవ్‌ స్టోరీ చేస్తున్నానని చాలా ఎక్జయిట్‌ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్‌ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతూ సినిమా క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. పాపులర్‌ మాలీవుడ్‌ యాక్టర్‌ జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానిక ఇసంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ అందిస్తున్నాడు. పీరియాడిక్‌ వార్‌ అండ్‌ లవ్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. సూర్య హోంబ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్‌ 2025 పొంగళ్‌ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు . ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అండమాన్‌ ఐలాండ్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీం.. పోర్ట్‌ బ్లెయిర్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటు సూర్య, పూజాహెగ్డేపై వచ్చే సాంగ్స్‌ను చిత్రీకరించినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌.

ఇంకా చదవండి: 'కన్నప్ప'తోనైనా మంచు విష్ణుకు హిట్టు పడేనా..?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# సూర్య 44     # సూర్య     # కార్తీక్‌ సుబ్బరాజు    

trending

View More