మరోసారి అనిల్ రావిపూడితో వెంకటేశ్
4 months ago | 36 Views
వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఎఫ్2’, 'ఎఫ్3’ సినిమాల తర్వాత ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఐశ్వర్య రాజేశ్, విూనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా ఇటీవలే పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఈ చిత్ర సెట్లోకి వెంకటేశ్ అడుగు పెట్టారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ మేకింగ్ వీడియోని పంచుకుంది. దీన్ని బట్టి ఈ ప్రస్తుత షెడ్యూల్‌లో వెంకీతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కుటుంబ నేపథ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. తన అందమైన భార్య.. మాజీ ప్రియురాలు మధ్య జరిగే కైమ్ర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీత మందిస్తుండగా.. సవిూర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇంకా చదవండి: మరో సినిమాపై మెగా దృష్టి
# Venkatesh # MaheshBabu # AnilRavipudi