వెంకట్ సాయి గుండ నటించిన హాలీవుడ్ చిత్రం “ది డిజర్వింగ్” పోస్టర్ విడుదల

వెంకట్ సాయి గుండ నటించిన హాలీవుడ్ చిత్రం “ది డిజర్వింగ్” పోస్టర్ విడుదల

4 months ago | 34 Views

వెంకట సాయి గుండ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం “ది డిజర్వింగ్” చిత్రం నుంచి అధికారిక పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం ముఖ్యంగా చిన్నతనంలో జరిగే పరిస్థితులు, గృహహింస, సైకాలజికల్ సమస్యల వంటి సమాజ సమస్యలపై వినుత్నంగా తెరకెక్కించిన సైకాలజికల్ హారర్ థ్రిల్లర్. కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా, గాఢమైన సందేశాన్ని కలిగి ఉంది. ప్రత్యేకమైన జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రజాదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. 

ఈ చిత్రంలో లీడ్ రోల్ మూగవాడు కావడం ప్రత్యేక అంశం. దీంతో చిత్రం కథ, కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. “ది డిజర్వింగ్” చిత్రం ఇప్పటికే ఫ్రాన్స్, టొరంటో, స్వీడన్, నేపాల్, లండన్, నైజీరియా, బెర్లిన్, స్పెయిన్, న్యూయార్క్, కేన్స్, రోమ్ వంటి దేశాల్లో అనేక అవార్డులను గెలుచుకుని అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఈ చిత్రం బార్సిలోనా, స్పెయిన్‌లో జరగబోయే ఒక ప్రధానమైన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతుంది, దానిద్వారా అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందుతోంది.

ఈ చిత్రంలో నటించిన వెంకట్ సాయి గుండ నటనకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై అనేక బెస్ట్ యాక్టర్ అవార్డులను అందుకున్నారు. ఈ చిత్రం 14వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. దీంతో ఈ చిత్రంపై అందరికీ మరింత ఆసక్తి నెలకొంది. విడుదలకి ముందుగానే ఎన్నో ప్రశంసలను అందుకోవడం, ఒక తెలుగు వ్యక్తి చిత్రీకరించి, నటించిన 

హాలీవుడ్ చిత్రానికి  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం చాలా గర్వకారణం.

వెంకట సాయి గుండకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణం నుంచి ఈ స్థాయికి ఎదగడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది కేవలం ఆయనకు ఉన్న క్రమశిక్షణ, కథను ప్రపంచానికి చెప్పాలనే పట్టుదల, ఆసక్తి ఇంతవరకు తీసుకొచ్చాయి. అంతేకాదు ఆయన ఆలోచనలకు మద్దతు ఇస్తూ ఆయన వెన్నంటి నడిచే స్నేహితులు విస్మయ్ కుమార్ కోతోపల్లి, తిరుమలేశ్ గుండ్రత్ సాహకారంతో ఈ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించారు. 

“ది డిజర్వింగ్”  చిత్రం అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. “ది డిజర్వింగ్” చిత్రం కోసం వెంకట్ సాయి గుండ ఎంత శ్రమించారో అతి త్వరలో యావత్తు ప్రపంచం చూస్తుంది. ఈ చిత్రం ఎందరికో స్పూర్తిగా నిలుస్తుంది. కచ్చితంగా కఠోర కృషి, అభిరుచి ఉంటే, గ్లోబల్ స్థాయిలో విజయాన్ని సాధించవచ్చు అని ఈ చిత్రం నిరూపిస్తుంది. వెంకట సాయ గుండ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో నిర్మించి, ఎంతోమంది ఆర్టిస్టులను హాలీవుడ్ పరిశ్రమలో పని చేయడానికి కొత్త మార్గాన్ని వేశారు.

ఇంకా చదవండి: ఓటిటిలోకి 'కల్కి 2898 ఏడీ’

# TheDeserving     # VenkatSaiGunda     # October1    

trending

View More