ఉస్తాద్ రామ్ పోతినేని, మహేష్ బాబు పచ్చిగొల్ల, మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.

ఉస్తాద్ రామ్ పోతినేని, మహేష్ బాబు పచ్చిగొల్ల, మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.

1 month ago | 5 Views

ఉస్తాద్ రామ్ పోతినేని కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో అలరించిన యువ దర్శకుడు మహేష్ బాబు పచ్చిగొల్లతో ఆయన సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి  నిర్మాతలు.

హీరోగా రామ్ పోతినేని 22వ చిత్రమిది. విజయదశమి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కొత్త కబురు ఏమిటంటే... నవంబర్ 21న, ఈ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఒక సైకిల్, దాని మీద ఒక బుక్‌... సైకిల్ ను తీసుకు వెళ్తున్న హీరో రామ్... ఫోటో వెనుక నుంచి తీసినా... రామ్ షూస్, హెయిర్ స్టైల్ చూస్తే... స్టైలిష్ గా ఉండబోతుందని అర్థం అవుతోంది.

#RAPO22 రామ్ కెరీర్‌కు సిగ్నిఫికెంట్ ఎడిషన్ కానుంది. ఈ మూవీలో ఓ యూనిక్ క్యారెక్టర్ లో ఆయన కనిపించనున్నారు. ఇది రామ్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది.

దర్శకుడు మహేష్ బాబు తన మునుపటి చిత్రాలలో హ్యుమర్, ఎమోషన్స్ బ్లెండ్ చేసి అలరించారు.  అప్ కమింగ్ మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మూవీ లైట్ హార్టెడ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనుంది.  ప్రారంభోత్సవం రోజున నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

తారాగణం: రామ్ పోతినేని

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: మహేష్ బాబు పచ్చిగొల్ల

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

ఇంకా చదవండి: రిలీజ్‌కు ముందే 'పుష్ప 2' రికార్డు!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# RAPO22     # రామ్ పోతినేని     # మహేష్ బాబు    

trending

View More