20న ప్రేక్షకుల ముందుకు ఉపేంద్ర నటించిన 'యూఐ'
5 days ago | 5 Views
వినూత్న కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు కన్నడ అగ్రనటుడు ఉపేంద్ర. ఆయన పోషించే పాత్రలు కూడా విలక్షణంగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడిక్ ఫాంటసీ చిత్రం ‘యూఐ’పై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. లహరి ఫిల్మ్స్ పతాకంపై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. చాలా విరామం తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లుంటాయని మేకర్స్ తెలిపారు. సమకాలీన సమాజంలోని సంఘటనలతో పాటు భవిష్యత్తు భారతంలోని సమస్యలను కథాంశంగా తీసుకొని తనదైన శైలిలో ఉపేంద్ర ఈ సినిమాను తెరకెక్కించారని, కొంతభాగం కథ 2040లో నడుస్తుందని, విజువల్స్ అబ్బురపరుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. రీష్మా నానయ్య, మురళీశర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య తదితరులు ఈ చిత్రలో నటించారు.
ఇంకా చదవండి: ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# యూఐ # ఉపేంద్ర # సన్నీలియోన్ # డిసెంబర్20