ఉన్ని ముకుందన్ మార్కో టీజర్ విడుదల !!!

ఉన్ని ముకుందన్ మార్కో టీజర్ విడుదల !!!

2 months ago | 5 Views

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్ష‌న్ జాన‌ర్‌లో రానున్న ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్‌ కు మంచి స్పందన లభించింది. 


ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది, అలాగే ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి సరికొత్త లుక్ సోషల్ మీడియాలో విడుదల చేశారు ఈ లుక్ చాలా డిఫరెంట్ గా స్టన్నింగ్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

లేటెస్ట్ గా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. టీజర్ చూస్తుంటే స్టన్నింగ్ గా అనిపిస్తోంది. యాక్షన్ తో కూడిన సినిమాగా మార్కో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యాన‌ర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండ‌గా.. ప్రేమ‌మ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.

మార్కో డిసెంబర్ 20న 5 భాషల్లో విడుదలవుతోంది. ఇది అత్యంత హింసాత్మక యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్. ఉన్ని ముకుందన్ నటించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో యానిమల్ మూవీ స్టంట్ మాస్టర్ కలై కింగ్సన్ కొరియోగ్రఫీలో 8 యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు షమీర్ మహమ్మద్ ఎడిటర్.

ఇంకా చదవండి: సమంత యాక్షన్ మూవీ 'సిటాడెల్: హనీ బన్నీ' ట్రైలర్ విడుదల

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Marco     # UnniMukundan     # ShareefMuhammed    

trending

View More