ఓటీటీ ప్లాట్‌పాంపైకి ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు

ఓటీటీ ప్లాట్‌పాంపైకి ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు

1 month ago | 5 Views

 సమంత, నయనతార ఇద్దరు టాప్‌ హీరోయిన్లే. ఇద్దరినీ తమ తమ అభిమానులు సౌతిండియా లేడీ సూపర్‌ స్టార్‌లుగా పిలుచుకుంటారు. అంత బాగానే ఉంది కానీ.. తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు టాప్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లో ఒకరు వెబ్‌ సిరీస్‌తో మరొకరు డాక్యుమెంటరీతో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండిటికి పబ్లిసిటీ పీక్‌లో లభించిన రిజల్ట్‌ మాత్రం గొప్పగా రాలేదు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు ఈ ఇద్దరిపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. సమంత మయోసైటిస్‌తో ఆవేదన చెందుతూ సోషల్‌ మీడియాలో హైలెట్‌గా నిలుస్తున్న సమయంలోనే ‘సిటాడెల్‌ హనీ బన్నీ’ సిరీస్‌తో ముందుకొచ్చింది.


అయితే ఈ సిరీస్‌ పెద్దగా ఎలాంటి ఇంపాక్ట్‌ చూపలేక పోయింది. అనారోగ్య సమస్యలున్నా సమంత ఈ సిరీస్‌ కోసం ఫిజికల్‌గా ఎంతో కష్టపడి పోరాట సన్నివేశాలను చేసింది. కానీ, సమంత చేసిన ఫైట్స్‌ సీన్స్‌ కంటే ఇందులోని ఆమె వరణ్‌ ధావన్‌తో కలిసి నటించిన ఒకటిరెండు రొమాంటిక్‌ సన్నివేశాల గురించిన ప్రస్తావనే ఎక్కువగా జరిగింది. దీంతో కొందరు సమంతని పబ్లిసిటీ ఫుల్‌, రిజల్ట్‌ నిల్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరోవైపు, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న నయనతారకి కూడా సేమ్‌ పరిస్థితి ఏర్పడింది.  ధనుష్‌ కాంట్రవర్సీతో అందరి దృష్టి ఆమెపై పడింది.  ఈ నేపథ్యంలోనే ఆమె నెట్‌ ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ రిలీజ్‌ అయ్యింది. దీనికి పలు సెలబ్రిటీలు మద్దతు తెలిపిన క్రిటిక్స్‌, ఆడియెన్స్‌ మాత్రం తీసి అవతల పడేశారు. అసలు పెళ్లి క్యాసెట్‌ను ఓటీటీకి అమ్మాలన్న చీప్‌ ఆలోచన నయనతారకు ఎందుకు వచ్చిందని నెటిజెన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

ఇంకా చదవండి:ఇక థియేటర్ల ముందు సినిమా రివ్యూలకు నో ..!?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సమంత     # నయనతార    

trending

View More