విడుదలకు సిద్దంగా రెండు భారీ సినిమాలు... 15న రానున్న 'డబుల్‌ ఇస్మార్‌',  'మిస్టర్‌ బచ్చన్‌'

విడుదలకు సిద్దంగా రెండు భారీ సినిమాలు... 15న రానున్న 'డబుల్‌ ఇస్మార్‌', 'మిస్టర్‌ బచ్చన్‌'

4 months ago | 46 Views

 రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రానున్న సినిమా ’డబుల్‌ ఇస్మార్ట్‌’, అలాగే హీరో రవితేజ` డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ’మిస్టర్‌ బచ్చన్‌’. ఈ రెండు మూవీలు ఆగస్టు 15న విడుదల కానున్నాయి. తాజాగా వీటికి సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్‌ విూడియాలో సందడి చేస్తోన్నాయి. ’డబుల్‌ ఇస్మార్ట్‌’లో మాస్‌ పాత్రలో కనిపించనున్న రామ్‌ పోతినేని.. క్లాసీ లుక్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ’మాస్‌ మ్యాడ్‌నెస్‌కు సిద్ధమా’ అనే క్యాప్షన్‌ పెట్టారు. మరోవైపు ’మిస్టర్‌ బచ్చన్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేసినట్లు కథానాయిక భాగ్యశ్రీ బోర్సే వెల్లడిరచారు. ఆమెకు ఇది టాలీవుడ్‌లో తొలి సినిమా అయినప్పటికీ స్వయంగా తెలుగు నేర్చుకొని తానే డబ్బింగ్‌ చెప్పారని చిత్రబృందం తెలిపింది. దీంతో సోషల్‌ విూడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి.’డబుల్‌ ఇస్మార్ట్‌’ విషయాకిస్తే.. పూరి`రామ్‌ల హిట్‌ కాంబోలో తెరకెక్కిన ’ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా ఇది రానుంది. ఆ సినిమా ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ’మిస్టర్‌ బచ్చన్‌’ టీజర్‌, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. ’ప్రేక్షకుల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుందీ చిత్రం’ అని విడుదల చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్‌లోనూ భారీ వ్యూస్‌తో ట్రెండిరగ్‌లో కొనసాగుతున్నాయి.

ఇంకా చదవండి: రామాయణంలోకి అడుగు పెడుతున్న కునాల్‌

# DoubleIsmart     # RamPothineni     # MrBachchan     # RaviTeja     # August15    

trending

View More