జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించనున్న త్రిప్తి డిమ్రి

జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించనున్న త్రిప్తి డిమ్రి

2 months ago | 20 Views

యానిమల్ మూవీతో తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకున్న త్రిప్తి డిమ్రి, ఇప్పుడు మరో చిత్రం తో సెన్సషనల్ కానున్నది. అయాన్ ముఖేర్జీ దర్శత్వంలో రానున్న 'వార్ 2' చిత్రంలో హ్రితిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ కు ఇది మొదటి చిత్రం. తాజాగ ఏప్రిల్ 11న Jr NTR ముంబైలో కనిపించారు. RRR నటుడు హృతిక్ రోషన్‌తో వార్ 2 యొక్క 10-రోజుల షూట్ షెడ్యూల్ కోసం వచ్చినట్లు సమాచారం వచ్చింది. హృతిక్ రోషన్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం షూట్ చేస్తున్నారు, మరియు కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి జూనియర్ ఎన్టీఆర్ అతనితో జతకట్టారు. అతని పాత్ర బూడిద రంగు షేడ్స్‌తో వస్తుందని మరియు ఇది జూనియర్ ఎన్టీఆర్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని పాత్రా, ఇది ఖచ్చితంగా అతని అభిమానులకు ఆక్షర్య పరిచేలా ఉండబోతుంది అని చిత్ర బృందం వారు తెలియజేసారు. అయితె, ఈయనకు జంటగా ఎవరు నటించనున్నారు అనే విషయం చాలా హాట్ టాపిక్ గ మారింది. 

ఎన్టీఆర్ కు జోడిగా త్రిప్తి డిమ్రి

అయితే, ఇప్పుడు తాజా గ మరో విషయం వేలుగులోకి వచ్చింది... ఈ చిత్రం లో ఎన్టీఆర్ కు జంటగా త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రగా నటిస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఇప్పటికే యానిమల్ చిత్రంతో ఎందరో అభిమానులను మేపించిన త్రిప్తి డిమ్రి, ఈ వార్ 2 మూవీతో మేపింస్తుందో లేదో చూడాల్సిందే. కానీ దీనిపై అధికారిక ప్రకటన కోసం ఇంకా ఎదురుచూడాల్సిందే. దీనితో వార్ 2 పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. వార్ 2 తో వీళ్ళు ఇద్దరు ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో  చూడాలి... 

ఇంకా చదవండి: విజయ్‌ తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌'

# War2     # HrithikRoshan     # JrNTR     # TriptiDimri