
మలయాళ సినీ హిస్టరీలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో ట్రైలర్ రిలీజ్..
1 day ago | 5 Views
మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పటినుంచి అభిమానులు, ప్రేక్షకులు సినిమాను చూడటానికి ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతూ L2E: ఎంపురాన్ ట్రైలర్‌ను మార్చి 20 మధ్యాహ్నం గం1.08నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పృథ్వీరాజ్ సుకుమార్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచాన్ని చూడటానికి ప్రేక్షకులు సిద్ధం కావచ్చు. ఐనాక్స్ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్, మలాడ్, ముంబై వేదికలుగా మలయాళ చిత్రసీమలోనే కాదు, మలయాళ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ వెర్షన్‌లో ట్రైలర్‌ను విడుదల చేస్తుండటం విశేషం.
2019లో విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన లూసిఫర్‌కు ఇది సీక్వెల్. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమాకు చెందిన రెండో భాగమే L2E: ఎంపురాన్. మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి మాస్ అవతార్‌లో మెప్పించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ మూవీతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
మలయాళ చిత్రసీమలోనే అత్యంత భారీ చిత్రంగా ‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తోంది.
‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండగా హిందీలో అనీల్ తడానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కర్ణాటకలో ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడులో గోకులం గోపాలన్ కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల. మలయాళ చిత్రసీమ నుంచి ఐమ్యాక్స్‌లో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా ‘L2E: ఎంపురాన్’ ప్రపంచ ప్రేక్షకులను మెప్పించనుండటం విశేషం.
ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో ట్రైలర్ విడుదల చేయటమే కాదు, మీడియాకు కూడా ఇదే తరహాలో ప్రత్యేకమైన షోను ప్రదర్శించనుండటం విశేషం.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!