'సర్దార్-2' షూటింగ్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు స్టంట్ మాస్టర్ ఎజుములై మృతి
5 months ago | 40 Views
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా నటించిన సర్దార్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'సర్దార్ -2' షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరిగింది. తాజా సమాచారం ప్రకారం భారీ యాక్షన్ షెడ్యూల్‌ను తెరకెక్కించే సమయంలో ప్రముఖ ఫైట్ మాస్టర్ ఎజుమలై కిందపడి మరణించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఘటనలో మరో ఇద్దరు అసిస్టెంట్స్ మాస్టర్‌లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ పోరాట సన్నివేశాలను దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి తీస్తుండగా ఎజుమలై కిందపడి మృతి చెందాడు. ఇక ఎజుములైకు ఛాతిలో తీవ్రంగా దెబ్బ తగలడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అపుడు హీరో కార్తీ కూడా షూటింగ్ స్పాట్ లో ఉన్నారని సమాచారం. దీంతో 'సర్దార్ 2' ఫస్ట్ షెడ్యూల్ లో ఇంతటి ప్రమాదం జరగడం పట్ల చిత్ర బృందం తీవ్ర దిగ్బాంతి చెందుతున్నారు. గతంలో 'ఇండియన్ 2' షూటింగ్‌లో కూడా ఫైట్ మాస్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇపుడు 'సర్దార్-2' షూటింగ్ ప్రమాదంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 'సర్దార్ 2’ షూటింగ్‌లో జరిగిన ప్రమాదం విూద చెన్నైలోని విరుగంబాక్కమ్ స్టేషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రమాదంతో స్టంట్ సీక్వెన్సులు తీసే సమయంలో మూవీ యూనిట్స్ తీసుకునే సేప్టీ ప్రికాషన్స్ విూద మరొకసారి చర్చ మొదలు అవుతోంది.ఇటీవలే జూలై 15న 'సర్దార్ 2' షూటింగ్ ను చెన్నైలో గ్రాండ్ స్టార్ట్ చేశారు మేకర్స్. సర్దార్ మూవీ తెలుగులో విడుదలై సూపర్ హిట్ అయింది.స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్స్ లో నటించారు.పోలీస్‌గా,దేశ రక్షణ కోసం పోరాడే సీక్రెట్ ఏజెంట్ గా నటించి సక్సెస్ అందుకున్నారు. డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ తెరకెక్కించిన సర్దార్ మూవీని మంచి సామాజిక సందేశంతో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.దీంతో 'సర్దార్ 2'మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
# Sardar-2 # Karthi