ప్రభాస్‌తో మరో మూడు భారీ సినిమాలు.. అధికారికంగా ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్ !
19 days ago | 5 Views
ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' హిట్ తర్వాత కొన్ని రోజులు ఫ్లాప్స్ తో సతమతయ్యాడు. ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి ఎవరైనా అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కసి తీరా కోరుకున్నారు. ఆ క్రమంలోనే వచ్చిన మూవీ ‘సలార్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాటేరమ్మ జాతర చేసి కలెక్షన్ల బ్లడ్ సునామీని సృష్ఠ్టించింది. తర్వాత ప్రభాస్ ‘కల్కి’తో మరో బ్లాక్‌బస్టర్ అందుకొని టాలెంటెడ్ డైరెక్టర్లతో వరుస సినిమాలు చేస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ.. ‘సలార్’ మూవీ నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ అందించారు. అది ‘సలార్ 2’ గురించేమో అని భ్రమపడకండి, అంతకు మించిన అప్డేట్. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ప్రభాస్ కెరీర్ కాస్త ఇబ్బందులో ఉన్నపుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘సలార్’ సినిమా ఎంత రిలీఫ్ ఇచ్చిందో అందరికి తెలిసిందే. అయితే మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్ ఇవ్వడానికి హోంబలే ఫిల్మ్స్ ఎవరు ఊహించని ప్లాన్ చేసింది. ప్రభాస్‌తో ఏకంగా వరుసగా మూడు సినిమాలు ప్లాన్ చేసింది. ఈ మూడు సినిమాలని 2026, 2027, 2028లలో రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ‘సలార్ 2’ రిలీజ్‌తో ఈ జర్నీ ప్రారంభం అవుతుందని తెలిపింది.
ఇంకా చదవండి: అందుకే.. అలాంటి సినిమాలకు దూరంగా ఉంటా : సమంత