'పుష్ప 2'కు ఆ రెండు సినిమాలే టార్గెట్.. ఇప్పటి వరకు రూ.1508 కోట్ల గ్రాస్ దాటిన 'పుష్ప-2'
5 hours ago | 5 Views
భారీ అంచనాల మధ్య విడుదలై ఎప్పటిలాగే సౌత్‌తోపాటు నార్తిండియన్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు పుష్పరాజ్. ఐకాన్ అల్లు అర్జున్ సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై న పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్ డేనే జవాన్, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును బద్దలు కొట్టిందని తెలిసిందే. తాజా కలెక్షన్ల రిపోర్ట్‌తో పుష్పరాజ్ మేనియా ఎలా ఉందో అర్థమవుతోంది. పుష్పరాజ్ ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. 15 రోజుల్లోనే రూ.1508 కోట్లు వసూళ్లు రాబట్టి అత్యధిక వేగంగా ఈ మార్క్ చేరుకున్న చిత్రంగా అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇప్పటివరకు ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ ఇండియన్ మూవీస్ అమీర్ ఖాన్ దంగల్ (రూ.2070. 30 కోట్లు), బాహుబలి.. ది కంక్లూజన్ (రూ.1786.06 కోట్లు) పేర్లతో ఉన్న రికార్డ్‌ను పుష్ప 2 ది రూల్ అధిగమించడం ఖాయమని తాజా కలెక్షన్లు చెప్పకనే చెబుతున్నాయి. పుష్ప 2 మరికొన్ని రోజుల్లోనే ఈ ఫీట్ చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ సోయగం రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా ఇంప్రెస్ చేసింది. సీక్వెల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇంకా చదవండి: సూపర్ స్టయిలిష్ గా సోహైల్‌ఖాన్.. ఎన్‌కెఆర్ 21లో పాత్ర ఏంటోమరీ..?
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# పుష్ప 2 # అల్లు అర్జున్