త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’...

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’...

1 month ago | 5 Views

‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్‌ రేంజ్‌ పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో నిఖిల్‌  ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో అతి త్వరలో ఆడియెన్స్‌ ముందుకు రాబోతోన్నారు. 'స్వామి రారా, కేశవ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల తర్వాత సుధీర్‌ వర్మ, నిఖిల్‌ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ చిత్రంలో కన్నడ క్రేజీ హీరోయిన్‌ అయిన రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించారు. మరో బ్యూటీ డాల్‌ దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్రలో నటించగా.. హర్ష చెముడు ఓ ముఖ్య పాత్రను పోషించారు. తాజాగా ఈ మూవీ గురించి హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ప్రీమియర్‌ కి మంచి స్పందన వచ్చింది. ‘స్వామిరారా’లో మిస్‌ అయినా ప్రేమకథను ఈ సినిమాలో చూపించాం.


సినిమాలో ప్రతి పదినిమిషాలకు ఒక ట్విస్ట్‌ ఉంటుంది. సినిమా క్లైమాక్స్‌ ని ఎవరూ  ఊహించలేరు. మూవీ స్క్రీన్‌ ప్లే ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఈ సినిమాని నేను ఎప్పుడు తీశానని చాలా మందికి సందేహం ఉంది. ‘కార్తికేయ’ సినిమా తర్వాత దీని తెరకెక్కించాలనుకున్నాం. ‘స్పై’ సినిమా కంటే ముందే రావాల్సిన సినిమా ఇది. ప్రస్తుతం చేస్తోన్న ఒక సినిమా మధ్యలో షెడ్యూల్‌ బ్రేక్‌ రావడంతో దీన్ని కంప్లీట్‌ చేశామంటూ’’ చెప్పుకొచ్చారు.  నిఖిల్‌ నటిస్తోన్నప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం వియత్నాంలో కఠోర శిక్షణ తీసుకున్నారు నిఖిల్‌. 'ఠాగూర్‌' మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌కు చెందిన భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్న ఈ ఎపిక్‌ ఒడిస్సీలో లెజెండరీ యోధుని పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు నిఖిల్‌. నమ్మశక్యం కాని యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రంలో నిఖిల్‌ కొన్ని అద్భుతమైన స్టంట్స్‌ చేయనున్నారు.

ఇంకా చదవండి: రింగ్‌ మాస్టర్‌ వచ్చేశాడు.. 'మట్కా' ట్రైలర్‌ రిలీజ్‌.. 14న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అప్పుడో ఇప్పుడో ఎప్పుడో     # నిఖిల్‌    

trending

View More