రవితేజ షూటింగ్ ప్రారంభానికి యూనిట్ సిద్దమవుతోంది ...
2 months ago | 5 Views
దసరా తర్వాత మాస్ మహారాజా రవితేజ ధమాకా మొదలువుతందా? అంటే అవుననే తెలుస్తోంది. ఏంటి ధమాకా అంటే దసరా సందర్భంగా ఉండాలి గానీ...పండగ వెళ్లిన తర్వాత దసరా ఏంటి? అనుకుం టున్నారా? అయితే వివరాల్లోకి వె ళ్లాల్సిందే. రవితేజ కథా నాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కారణంగా రవితేజ గాయపడటంతో తాత్కాలికంగా షూటింగ్ ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రవితేజ విశ్రాంతి లోనే ఉన్నారు. ఇల్లు దాటి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా రవితేజ కోలుకోవడంతో మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభానికి యూనిట్ సిద్దమవుతోంది. దీనిలో భాగంగా ఈనెల 14 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం.
సుదీర్ఘంగా సాగే షెడ్యూల్ ఇది. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు టాకీ పార్టు చిత్రీకరణ ఉంటుందని సమాచారం. అప్పటి నుంచి రవితేజ విశ్రాంతి లోనే ఉన్నారు. ఇల్లు దాటి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా రవితేజ కోలుకోవడంతో మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభానికి యూనిట్ సిద్దమవుతోంది. దీనిలో భాగంగా ఈనెల 14 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం.
సుదీర్ఘంగా సాగే షెడ్యూల్ ఇది. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు టాకీ పార్టు చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ప్రేక్షకాభిమానులకు మంచి కిక్కిచ్చే రవితేజ మార్క్ సన్నివేశాలు కొన్ని చిత్రీకరిస్తారుట. అనంతరం సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇవ్వబోతున్నారుట. అది టీజర్ అవ్వొచ్చని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. మరి అది టీజరా? లేక ఇంకేదైనా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారా? అన్నది తెలియాలి. ఇందులో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా? కెమిస్ట్రీ సూపర్ అని 'ధమాకా' చిత్రంతో ప్రూవ్ అయింది. అందుకే రాజా మరోసారి ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. పైగా ధమాకా మంచి విజయం సాధించిన చిత్రం. ఆ తర్వాత నటించిన చిత్రాలన్ని ప్లాప్ అయ్యాయి. అలా రాజాకి శ్రీలీల ఎంట్రీ అన్నది చిన్న సెంటిమెంట్ గా కూడా కలిసొచ్చింది. ఇందులో రవితేజ ఆర్పీఎఫ్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: 'వార్-2' సెట్ లోకి ప్రవేశించిన ఎన్టీఆర్!!